Thursday, October 27, 2011

వీరిని రాజకీయ 'లఫంగీలు' అందామా....!!!

వీరిని రాజకీయ 'లఫంగీలు' అందామా....!!!

“అర్ధరాత్రి ఎవరినీ అడగకుండా కర్ణాటక మొయిలీ,తమిళనాడు చిదంబరం , తెలంగాణా ఇస్తామంటారా !వాళ్ళెవరు ఇవ్వడానికి ?....నాకు ఆంధ్ర,తెలంగాణారెండు కళ్ళు . ఆంధ్రావాళ్ళు సమైక్యాంధ్ర అనాలి, తెలంగాణావాళ్ళు జై తెలంగాణాఅనాలి....కాదు,కాదు నేను తటస్థం.” 
చంద్రబాబు

"నేను సామాజిక తెలంగాణా కావాలనుకొన్నాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు సమైక్యాంధ్ర అంటున్నారు, కనుక సమైక్యాంధ్ర కావాలి. ... లేదు లేదు అధిష్టానం ఏదంటే అదే."
చిరంజీవి

"తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని, నేను
ప్రూవ్ చేస్తాను.యాబై శాతం కంటే ఎక్కువ తెలంగాణా
ప్రజలు సమైక్యాంధ్ర కోరు కొంటున్నారు. తెలంగాణా వస్తే అభివృద్ది ఆగి పోతది."
లగడపాటి

"తెలంగాణాను కానివ్వం.ఎవరడిగితే వాళ్ళకు రాష్ట్రం ఇచ్చేస్తారా? జిల్లాకో రాష్ట్ర మివ్వ మనండి."
కావూరి

"తెలంగాణా ఇవ్వడం అంత సులభం కాదు. ఆంధ్ర వాళ్ళు తలచుకుంటే తెలంగాణా వాళ్ళు ఎక్కడుంటారు."
రాయపాటి

"కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణా ఒక వేర్పాటువాదం, రాజ్యాంగ విరుద్ధం."
గాదె వెంకటరెడ్డి

"తెలంగాణవాదం సరైంది కాదు. అసలు తెలంగాణా వాడెవడో ముందు చెప్పాలి.నేను కూడా తెలంగాణా వాడినే. మాకు రాయల - తెలంగాణా కావాలి."
జే సి దివాకర్ రెడ్డి

"తెలంగాణావాదులు దేశ ద్రోహులు. వారినందరినీ అండమాన్ దీవులలో బంధించాలి. మేం హైదరాబాద్ ను విడిచేది లేదు."
టి జి వెంకటేష్

Friday, September 16, 2011

సమ్మె సందర్భంలో సహనంతో వ్యవహరించాల్సిన సమయం

My Appeal to All Telanganites ...
ఈ రోజు నుండి తెలంగాణా లో ఉన్న స్కూళ్ళు అన్ని మూతపడబోతున్నాయీ, ఇప్పటికే సింగరేణి, ఉద్యోగుల సమ్మె తో ప్రభుత్వం గుండెల్లో గుబులు రేగుతోంది. ఇప్పుడు ఉపాద్యాయుల వంతు.
ఈ సమయంలో సామాన్య ప్రజలుగా మనమందరం సహనంతో ఉండి తెలంగాణా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి మనకు ఎంతో కొంత ఇబ్బంది కలిగినా, అది మన కోసమేనని అనుకోని అందరు కూడా స్వచంధంగా తెలంగాణా ఉద్యమంలో పాల్గొనాలి.
ఈ సమయంలోనే ప్రభుత్వం తన ధమన నీతి ని ప్రదర్శించి ఎస్మాని ప్రయోగించడానికి సిద్ధ పడుతోంది, కానీ ఇక్కడ ఇంకా మన తెలంగాణా ఉద్యమ కీలక అస్త్రాలు ఇంకా బయటికి రాలేదు, ఇంకా అవి మన అమ్ముల పొదిలో అస్త్రాలుగా ఇంకా భయతికి రాలేదు, అవి గనక బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు, అందుకే ఉద్యోగులేవరు కూడా ప్రభుత్వం చేస్తున్న పిట్ట బెదిరింపులకు బయపడే అవకాశమే లేదు, ఒకవేళ ప్రభుత్వం గనక ఎస్మాని ప్రయోగించడానికి సిధపడితే వెంటనే సమ్మె లోకి దిగడానికి ELECTRICITY JAC & RTC JAC రెడీగా ఉన్నాయ్, కాబట్టి తెలంగాణా సమాజం అంత కోది రోజులు ఓపిక పట్టక తప్పదు, ఎంతో కొంత సమ్మె ప్రభావం మనపై ఉండవచు ఆ ప్రభావం మనకోసేమేనని అందరు తెలుసుకొని ఉద్యమంలో పాల్గొనాలి.
జై తెలంగాణా

అడవిపై హక్కు ముమ్మాటికి ఆదివాసిలదే హక్కు

ఉరి శిక్ష ఇప్పటికే దాదాపు 90 దేశాలలో రద్దు చేసారు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన మన భారత దేశంలో ఇంకా ఈ ఉరిశిక్షని అమలుపరచడం ప్రజాస్వామ్యానికే కళంకం.జల్,
జంగల్, జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసి బిడ్డలను వేరే ఇతర కేసులు పెట్టి ఆదివాసి హక్కులను కాలరాస్తూ వారికి ఇలా ఉరిశిక్ష వేయడం చాలా హేయమైన చర్య, ప్రజాస్వామ్య వాదులుగా మేము దీనిని ఖండిచాలీ,
ముంబై దాడులలో అనేక మందిని పొట్టన పెట్టుకున్న కసాబ్ లాంటి టెర్రరిస్తులకు లేని ఉరిశిక్ష ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న వీరిపై ఎందుకింత తొందర??
అడవిపై హక్కు ముమ్మాటికి ఆదివాసిలదే హక్కు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ప్రజలని తన పాటలతో చైతన్య పరుస్తున్న జీతాన్ మారండి లాంటి వాళ్ళను అక్రమ కేసులను బనాయించి ఉరి తీయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఉరి తీయడమే, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉరి శిక్ష ని రద్దు చేసి అమాయకులు అయిన ఆదివాసి బిడ్డలని విడుదల చేయాలి.

సమైక్యవాదులార సమాధానం చెప్పండి.

1. ప్రత్యేక తెలంగాణ కోసం వై.ఎస్.ర్ 41 మంది ఎమ్మెల్యేల చేత తీర్మానం చేసి కాంగ్రెస్‌ హై కమాండ్ కు పంపినది నిజామా..? కాదా?(11-08-2000)
2. టి.ఆర్.ఎస్ తో 2004 లో ఏ ఉదేశ్యం పొత్తు పెట్టుకున్నారు?
3. తెలంగాణ ఇస్తమని చెప్పి మోసం చేయడం తెలంగాణ ప్రజలను వంచించడం కాదా?
4. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న పేదల భూములను గుంజుకుని దళారీ సంస్థలకు కట్టబెట్టడం వాస్తవం కాదా?
5. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద ఫార్మ మరియు కెమికల్ పరిశ్రమలలో ఎంతమంది తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇస్తున్నరు..?
6. 85 % స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిబంధనను సీమాంధ్ర కంపెనీలు ఎంత వరకు అమలు చేస్తున్నయ్‌..?
7. తెలంగాణను కాలుష్యకాసారంగా మార్చి తెలంగాణ సంపదను దోచుకోవడం నిజం కాదా..?
8. పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధాలతో తెలంగాణ పేరు తెలిని రోగాలతో బాధపడుతున్న విషయం వాస్తవమా..? కాదా..?
9. వేలాది ఎకరాల గురుకుల్ ట్రస్ట్ భూమిని దోచుకుని జయభేరీలు నిర్మించడం నిజంకాదా..?
10. ఆంధ్ర , రాయలసీమ ప్రజలకు మాత్రమే మనో భావాలు ఉంటయా..? తెలంగాణ ప్రజలకు ఉండవా?
11. ఆంధ్ర ,రాయలసీమ వలస వాదుల, పెట్టు బడిదారులు తెలంగాణ ప్రాంత సంస్కృతిని , సంపదను కొల్లగొడుతూ ఉంటే వాళ్ల నుంచి విముక్తి పొందాలకోవడం దేశద్రోహమా..?
12. విడిపోతమంటే.. కలిసుండాలనడం ఎతంవరకు సమంజసం..?
13. లగడపాటి,కావూరి, సుబ్‌బిరామిరెడ్డి లాంటి దోపిడిదారులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా?
14. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం ఇయ్యడానికి బ్రిటీషోడు ...ఇంగ్లాండ్ లో ఏకాభిప్రాయం అడిగిండా..?లేకుంటే భారత ప్రజల మహోన్నత పోరాటానికి తలవంచి...పారిపోయిండా..?
15. మా హైదరాబాద్ రాష్ట్రం గురించి బాలశిక్షలో ఎందుకు ఉండదు..మా రైతాంగ సాయుధ పోరాటం గురించి మీకెందుకు తెల్వదు...?
16. మాకు కరెంటు వచ్చినంక 17 ఏండ్ల తర్వాత మీరు కరెంటు కళ్ల చూసిన మాట వాస్తవమా..? కాదా..?
17. అలాంటి మీరొచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసినమనడం ఎతవరకు సమంజసం..?
18. మీరొచ్చినంక హైదరాబాద్‌లో కట్టిన ప్రముఖ కట్టడాలేవైనా ఉన్నయా..?
19. మీరొచ్చి కొత్తగా కట్టిన ఓ రైల్వే స్టేషన్‌ పేరు చెప్పండి..?
20. సీమాంధ్ర పెట్టుబడి దారులు అప్పణంగా తెలంగాణ భూములను కొల్లగొడుతున్న మాట నిజం కాదా..?